ఆయనో యువ నిర్మాత.. పెద్ద హీరోతో.. పెద్ద దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ, కాలం కలిసి రాకపోవడంతో, సినిమా నిర్మాణం ఆలస్యమయ్యింది. దర్శకుడేమో నిర్మాతకి బాగా కావాల్సిన వ్యక్తి. హీరోతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలే వున్నాయ్.
ఆ హీరో మహేష్‌బాబు. ఆ నిర్మాత నాగవంశీ, ఆ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమా ‘గుంటూరు కారం’. హీరోయిన్ మారింది.. కొత్త హీరోయిన్ వచ్చి చేరింది.. అబ్బో, కథ చాలానే జరిగింది.
ఎలాగైతేనేం, సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి సినిమా విడుదల కాబోతోంది. ‘వస్తున్నాం.. కొట్టేస్తున్నాం..’ అంటూ నిర్మాత చాలా ధీమాగా చెబుతున్నాడు. కానీ, అభిమానులే నమ్మడంలేదు.
సినిమాపై జీరో బజ్.. అని అనలేంగానీ, వుండాల్సిన స్థాయిలో అయితే బజ్ లేదు. కారణాలు చాలానే వున్నాయ్. కానీ, కంటెంట్ అదిరిపోయిందనీ.. సినిమా బాగా వస్తోందనీ.. ఇన్‌సైడ్ సోర్సెస్ అంటున్నాయి.
‘అయినాగానీ, నమ్మలేం బ్రదర్.. ముక్కీ మూలిగీ ఎలాగోలా సినిమా పూర్తి చేస్తున్నారు..’ అన్న చర్చ అభిమానుల్లోనే జరుగుతోంది. ఇదేమో నిర్మాతకి తలనొప్పిగా మారిందాయె.!
అభిమానుల్ని ఎలా కన్విన్స్ చేయాలో నిర్మాత నాగవంశీకి అర్థం కావట్లేదు. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.