Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మోహన్ బాబు ఒకరు. కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా, హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మోహన్ బాబు నిర్మాతగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన మోహన్ బాబుకు కాస్త కోపం కూడా ఎక్కువ అని చెప్పాలి ఆయన ముందు ఎవరైనా తోక జాడించిన అక్కడికక్కడే కత్తిరించేస్తుంటారు అందుకే మోహన్ బాబు దగ్గర ఏదైనా మాట్లాడాలి అంటే ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో మోహన్ బాబు తన కోపాన్ని చాలా వరకు తగ్గించుకున్నాను అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. అయితే రజనీకాంత్ కారణంగానే తనకు కోపం తగ్గింది అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేశారు. రజినీకాంత్ కూడా ఒకప్పుడు ఎంతో కోపం కలిగి ఉండేవారట అయితే మంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల తన కోపాన్ని తగ్గించుకున్నారని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా నేను నా కోపాన్ని తగ్గించుకున్నాను నువ్వెందుకు కోపం తగ్గించుకోలేకపోతున్నావు అంటూ మోహన్ బాబును ప్రశ్నించారట.
కోపం తగ్గించుకోవడానికి మంచి మంచి పుస్తకాలు చదువు అయితే ఆ పుస్తకాలలో నువ్వు చదివిన సారాంశాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే కోపం తగ్గుతుంది అంటూ సలహా ఇచ్చారని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా రజనీకాంత్ సలహా తీసుకున్న నాటి నుంచి తనకు కోపం పూర్తిగా తగ్గిపోయిందని ఈయన వెల్లడించారు. ఇక రజనీకాంత్ మోహన్ బాబు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది దాదాపు 5 దశాబ్దాలుగా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ ను హైమ్ బ్లడీ తలైవా అని ముద్దుగా పిలిచేవాడినని, మా మధ్య అంత చనువు ఉంది అంటూ మోహన్ బాబు ఈ సందర్భంగా తెలియజేశారు.
