ఓ యంగ్ హీరోయిన్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట ఓ యంగ్ ప్రొడ్యూసర్. ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేస్తానంటూ ఆమె వెంట పడుతున్నాడట. ఆమె పేరు ఎవరని అడగొద్దు కానీ, బాల నటిగా ఓ తమిళ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ ముద్దుగుమ్మ. ఇటీవలే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ, రిజల్ట్ ఫెయిలైంది. అలా ఆమెతో సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడా ప్రొడ్యూసర్.
అయినా కానీ, తన బ్యానర్‌లో ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వబోతున్నాడట ఆ యంగ్ ప్రొడ్యూసర్. తొలి సినిమా ఫ్లాప్ అయినా పాపలోని టాలెంట్‌ని ముందుగానే గుర్తించేశాడు కాబోలు.
వాస్తవానికి ఆ ముద్దుగుమ్మ మంచి విషయమున్న నటి. సరైన ఛాన్స్ పడితే, సత్తా చాటగల స్టామినా వున్నదే. ఆ కోణంలోనే మనోడు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా.? లేదంటే ఇంకేదన్నానా.? అంటూ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.