హిట్టు లేకపోయినా లిప్ లాక్ మీద మోజు మాత్రం తగ్గడం లేదట ఆ కుర్రహీరోకి. ఎవరైనా సబ్జెక్ట్ తీసుకెళితే, హీరోయిన్‌తో కెమిస్ట్రీ డీప్‌గా పండే సన్నివేశాలు రాసుకుని రమ్మంటున్నాడట.
ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు కావాలంటున్నాడట. డైరెక్షన్ మీద వున్న కొద్దో గొప్పో అవగాహనతో ఆయనే కొన్ని సన్నివేశాలు రాసేసుకుంటున్నాడట.
వాటిని కథలో బలవంతంగా చొప్పించేయాలనుకుంటున్నాడట. దాంతో, కథ అడ్డం తిరుగుతోందని దర్శకులు గగ్గోలు పెడుతున్నారట.
అసలే ఈ హీరోకి మార్కెట్ సున్నా అయిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోనే. డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఓ రేంజ్‌లో స్టార్ డమ్ దక్కించుకున్నాడు.
కానీ, అది అప్పుడు. ఇప్పుడంత సీనూ సినిమా లేదీ యంగ్ స్టర్‌కి. ఏదో వచ్చిన వాటిలో మంచి సబ్జెక్ట్ ఎంచుకుని బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితి చూసుకోకుండా.. ఇలాంటి షరతులూ గట్రా పెడుతున్నాడని వాపోతున్నారట.
అయినా కానీ, ఓ మోస్తరు నుంచి పెద్ద బ్యానర్ వరకూ ఈ హీరోతో సినిమా చేసేందుకు రెడ్ కార్పెట్ వేస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. నిజమే గతంలో రెడ్ కార్పెట్ వేసిన మాట వాస్తవమే. కానీ అవన్నీ ప్లాపులు.. కాదు కాదు డిజాస్టర్లుగా మిగిలాయ్.
ఓటీటీల పుణ్యమా అని ఒకింత ఇప్పుడీ కుర్ర హీరో సినిమాల పరిస్థితి స్టడీగా వున్నట్టు కనిపించినప్పటికీ. ధియేటర్లకు అస్సలు బిజినెస్ లేనే లేదాయె.!