ఆ యంగ్ హీరో అతి చేస్తున్నాడట.!

ఇటీవలే ఓ పెద్ద హిట్ కొట్టిన హీరో గురించి ఓ గాసిప్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ హీరో అనూహ్యంగా తన క్యారెక్టర్ మార్చేసుకున్నాడట. చిన్న చిన్న విషయాలకే కోపం పెరిగిపోతోందట. ముందూ వెనకా చూడకుండా తన టీమ్ మీద నోరు పారేసుకుంటున్నాడట.

కష్టకాలంలో అండగా వున్నారని కూడా లెక్క చేయకుండా బిహేవ్ చేస్తున్నాడట. ఇదంతా హిట్టు వల్ల వచ్చిన పొగరు అని అంతా అనుకుంటున్నారు. ఎంత హిట్టు కొడితే మాత్రం ఇంత పొగరు చూపిస్తాడా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ హీరో బిహేవ్ చేస్తుండడంపై కొందరయితే షాకవుతున్నారట.

ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో అని తెలుస్తోంది. ఎంతటివాళ్లతోనైనా గౌరవ ప్రదంగా మసలుకునే ఆ హీరో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కాక ఆయన సన్నిహితులు తలలు పట్టుకుంటున్నారట. ఇలాంటి బిహేవియర్ కెరీర్‌ని నాశనం చేస్తుందని అతని ప్రవర్తనను చూసి అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.