దర్శకుడితో పొసగక తానే దర్శకుడిగా అవతారమెత్తాడు ఓ యంగ్ హీరో. నిర్మాతగా కూడా మారాడు. సొంత బ్యానర్‌లోనే తన సినిమాలు తెరకెక్కించేసుకుంటున్నాడు. హీరో, డైరెక్టర్, నిర్మాత.. ఇలా అన్ని భాగాల్లోనూ తానే వేలు పెట్టేస్తూ సత్తా చాటేయాలనుకుంటున్నాడు. కానీ, అన్ని రోజులూ ఒకేలా వుండవ్ కదా. ఎవరి పని వాళ్లని చేసుకుంటూ అంతా మంచిగా వుంటుంది.
అయినా అన్నీ తానే అయిపోవడం అంటే అంత చిన్న విషయం కాదు. తాజాగా ఓ సినిమా విషయంలో ఇదే పంచాయితీ వచ్చిందట ఆ కుర్ర హీరోకి. వేరే దర్శకుడితో చేస్తున్న సినిమా విషయంలో ఇలాంటి పంచాయితీనే రావడంతో, అర్ధాంతరంగా ఆ డైరెక్టర్‌ని పక్కకి నెట్టేసి తానే ఎంటర్ అయిపోయాడట.
దాంతో, డైరెక్టర్‌తో గొడవలు మొదలయ్యాయనీ సమాచారం. అలాగే, నిర్మాతల్నీ దగ్గరకి రానివ్వడం లేదట సదరు హీరో. దీంతో నిర్మాతలు కూడా గుస్సా అవుతున్నారట. కానీ, ఏం చేయలేని స్థితి నిర్మాతలదట.
దాంతో, ఇటు నిర్మాతలూ, అటు దర్శకులూ కూడా ఈ హీరో పిచ్చితనానికి తెల్ల మొహం వేస్తున్నారట. ఇంతకీ అన్నీ తానే అంటున్న ఈ పిచ్చి హీరో ఎవరో.? ఈ పంచాయితీ రచ్చ ఏంటో.!