బాలీవుడ్ భామతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి రెడీ అయిపోయిన ఓ ‘యంగ్’ హీరో, తన తాజా సినిమా కోసం ‘మల్లీశ్వరి’ కత్రినా కైఫ్ కావాలంటున్నాడట..అది కూడా ఐటమ్ సాంగ్ కోసమట.!
ఎవరా హీరో.? ఏమా కథ.? పాన్ ఇండియా అప్పీల్ కోసం.. చాలా చాలా జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడుగానీ, దర్శకుడి మీదనే ఇంకా డౌటానుమానాలు తగ్గట్లేదు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళిపోయింది.. భయాలూ పెరుగుతున్నాయ్. ఇంతకీ,
కత్రినా కైఫ్ వస్తుందా.? రాదా.? తెలుగులో అప్పుడెప్పుడో ‘మల్లీశ్వరి’తోపాటు ఇంకో సినిమా కూడా చేసిందామె. ఆ తర్వాత మళ్ళీ తెలుగు తెర వైపు చూడలేదు.
కుర్రాడి కోరిక మేరకు, నిర్మాతలు కత్రినాతో సంప్రదింపులు జరుపుతున్నా, ఆమె కనికరించడంలేదని ఫిలిం నగర్ వర్గాల గుసగుస. నిజమేనా.?