అందరికీ అవే కావాలంటే ఎలా.?

ఓ ‘పుష్ప’, ఓ ‘దసరా’, ఓ ‘విరూపాక్ష’.. ఈ టైప్ సినిమాలు కావాలంటూ ఓ యంగ్ హీరో కిందా మీదా పడుతున్నాడట. కొన్నాళ్ల క్రితం మంచి పాలోయింగ్ వున్న హీరో ఇతడు. ఇప్పుడంత సీనూ సినిమా లేకుండా పోయింది. చేజేతులారా కెరీర్‌ని నాశనం చేసుకున్నాడన్న టాక్ వుంది. ఇప్పుడేమో కనీసం సైడ్ క్యారెక్టర్లు చేస్తానన్నా ఛాన్సులు రాని పరిస్థితిలో వున్నాడు.

మంచి కథ దొరికితే, తానేంటో నిరూపించుకుంటానంటున్నాడీ యంగ్ హీరో. అదే వుద్దేశ్యంతో కథల వెంట పరుగులు తీస్తున్నాడట. అయినా వర్కవుట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా, రేంజ్‌కి మించి ఆలోచనలు మాత్రం మానడం లేదీ యంగ్ హీరో. ‘పుష్ప’, ‘దసరా’,

విరూపాక్ష’ సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ చిత్రాలుగా బాక్సాఫీస్ వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తరహా సినిమాతో వస్తే, మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చన్న వుద్దేశ్యంతోనే మనోడు ప్లాన్స్ వేస్తున్నాడట. అయితే, అలాంటి కథలు లక్కీగా తగులుతుంటాయ్. అంతే లక్కీగా హిట్టు ట్రాక్ ఎక్కేస్తుంటాయ్ ఆయా సినిమాలు.

అలా వర్కవుట్ అయ్యాయ్ ఆ సినిమాలు. అలాగని అదే ఫార్ములా అన్ని సార్లూ హిట్టవుతుందన్న నమ్మకం లేదు కదా. ఏమో.! ఈ యంగ్ హీరో లక్కు ఎలా వుందో చూడాలి మరి.