ఒకరికొకరు బ్రేక్ ఇచ్చుకునే ప్రయత్నంలో ఆ అమ్మాయ్.. ఆ అబ్బాయ్.!

వాళ్లిద్దరూ ప్రేమికులనీ, లేదు లేదు సహజీవనం చేస్తున్నారనీ కాదు కాదు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారనీ ఓ యంగ్ హీరోయిన్, ఓ యంగ్ హీరో మధ్య బోలెడన్ని గాసిప్స్ చక్కర్లు కొట్టాయ్ ఒకానొక టైమ్‌లో.

ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా సూపర్ హిట్టవ్వడం. ఆ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్ రిపీట్ అయ్యి అది కూడా మంచి హిట్ కొట్టడం.. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్యా అంతకు మించి ఇంకేదో జరుగుతోందంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయ్.

అయితే, ఆ తర్వాత అదంతా వుత్తదే.. అనీ తనకో బాయ్ ఫ్రెండ్ వున్నాడంటూ ఆ హీరోయిన్ షాకిచ్చింది. ఆ తర్వాత కెరీర్‌లో ఈ ఇద్దరూ డల్ అయిపోయారు. రేస్ నుంచి పూర్తిగా తప్పుకున్నారనే చెప్పొచ్చేమో.

కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మళ్లీ ఈ హిట్ పెయిర్ ఒక్కటి కానుందట. అదేనండీ ఈ హిట్ కాంబినేషన్ ఇంకోసారి సెట్ కాబోతోందట. దాంతో, ఈక్వేషన్స్ మళ్లీ ఛేంజ్ అయ్యాయని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్ గీయ్ ఫ్రెండ్ జాన్తా నై.. నా తొలి సినిమా హీరోనే నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటోందట సదరు హీరోయిన్. బెస్ట్ ఫ్రెండ్ కాదు.. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది.. అంటూ తాజాగా గాసిప్ గుప్పుమంటోంది.

పెళ్లీ, గిళ్లీ పక్కన పెట్టేసి.. తాము తలపెట్టిన కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారట. నిజంగానే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందా.? ఒకవేళ సెట్ అయితే, ఈ ఇద్దరూ ఒకరికొకరు బ్రేక్ ఇచ్చుకునేట్లుగా ఈ తాజా ప్రాజెక్ట్‌తో హిట్ కొడతారా.? లేదా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!