యంగ్ హీరోతో ప్రేమలో పడిన ఆ బ్యూటీ ఎవరబ్బా.?

ఆ ఇద్దరూ ఓ హిట్టు సినిమాతో తెరంగేట్రం చేశారు. హీరోయిన్ తెలుగమ్మాయ్ కాదు లెండి.! హీరో మాత్రం తెలుగబ్బాయే.! హీరో అవుదామనుకోలేదుగానీ, అనుకోకుండా హీరో అయిపోయాడు, హిట్లు కొట్టేశాడు.

ఇప్పుడైతే ఆ హీరోకీ హిట్లు లేవు.. ఆ హీరోయిన్ పరిస్థితీ అంతంతమాత్రంగానే వుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇద్దరూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అదే పెద్ద మ్యాజిక్కు.

ఈ మధ్యనే ఓ సినిమా నిర్మాణంలో వేలు పెట్టి చేతులు కాల్చుకుందామె. సదరు యంగ్ హీరోకీ, సదరు యంగ్ హీరోయిన్‌కీ మధ్య కెమిస్ట్రీ చాలాకాలంగా నడుస్తోంది. అబ్బే, అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఖండించేశారుగానీ.. ఇప్పుడా బంధం మరింత బలపడిందట.

త్వరలో ఇద్దరూ పెళ్ళిపీటలెక్కబోతున్నారని తెలుస్తోంది. ఆలస్యం అమృతం విషం.. అన్న కోణంలో ఆ ఇద్దరూ ముందడుగు వేయబోతున్నారట. వాళ్ళెవరన్నది కొద్ది రోజుల్లోనే అధికారికంగా వెల్లడి కాబోతోంది.. పెళ్ళి కబురుతో.!