నువ్వు హీరోగా పనికిరావు… ఆ హీరోకి ముందుగా వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్?

Megastar Sensational Comments

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించారు. ఇలా మెగా ట్యాగ్ తగిలించుకున్నటువంటి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కేవలం ఈ ట్యాగ్ వల్ల కూడా సక్సెస్ అయ్యారు. ఇలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీమ్ మెంబర్స్ ఉన్నంతమంది మెగా హీరోలు ఉన్నారు.

ఇక ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల విషయంలో కూడా మెగాస్టార్ జడ్జిమెంట్ అలాగే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి రావడం వారిని చిరంజీవి ప్రోత్సహించడం జరుగుతుంది.

ఇకపోతే మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరో కళ్యాణ్ దేవ్ గురించి చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకముందే ఆయన హీరోగా పనికిరారని చెప్పారట.చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండవ పెళ్లి చేసుకున్నటువంటి కళ్యాణ్ దేవ్ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే చిరంజీవి తాను హీరోగా పనికిరారని జోష్యం చెప్పారట.హీరోగా కాకుండా ప్రొడక్షన్ వైపు ప్రయత్నాలు చేయమని చెప్పినప్పటికీ కళ్యాణ్ దేవ్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇలా చిరు మాట వినకపోవడమే కాకుండా మెగా అల్లుడు కాస్త మెగా మాజీ అల్లుడుగా మారిపోయారని చెప్పాలి.