Sreeja: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈయన తన ఇద్దరు చెల్లెలు అలాగే తన కుమార్తె తన తల్లి అలాగే తన సోదరుడు నాగబాబుతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి తన తల్లి అంజనమ్మ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. అదే విధంగా తన చిన్న కుమార్తె శ్రీజ విడాకుల గురించి కూడా చిరంజీవి మొదటి సారి స్పందించారు.
మా అమ్మకు అందరికంటే నాగబాబు అంటేనే చాలా ఇష్టం అని తెలిపారు. ఇప్పటికీ కూడా వాడిని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దులు పెడుతుంది. అదేవిధంగా నా చిన్న కుమార్తె శ్రీజకు కూడా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం అనీ తెలిపారు. తను తీసుకునే ఏ నిర్ణయమైనా తన నాన్నమ్మ సలహా తీసుకొనే ముందడుగు వేస్తుందని చిరంజీవి తెలిపారు. తన విడాకుల విషయంలో కూడా నానమ్మ సలహానే తీసుకున్నారని తెలిపారు.
శ్రీజ విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు పడింది.రెండుసార్లు విడాకులతో ఆమె చాలా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిందనీ తెలిపారు. ఇక విడాకుల గురించి నా తల్లి అంజనమ్మ దగ్గర శ్రీజా ఈ విషయం చెప్పిన సమయంలో ఎవడో ఒకడి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు.నువ్వు ముందుకు వెళ్లాలి అంటూ శ్రీజలో ధైర్యాన్ని నింపింది మా అమ్మ. అందుకే ఏ విషయమైనా శ్రీజ ముందుగా నానమ్మతోనే చర్చిస్తుందని తెలిపారు..
19 సంవత్సరాల వయసులోనే తన కాలేజీ స్నేహితుడు శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా వెళ్లి పెళ్లి చేసుకున్నారు ఇక ఇతనితో కలిసి ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆయన డబ్బు కోసం పెట్టే టార్చర్ భరించలేక విడాకులు తీసుకుని తిరిగి తండ్రి వద్దకే వచ్చారు. అనంతరం చిరంజీవి తమ సమీప బంధువులు అయినటువంటి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు ఇక ఈ దంపతులకు మరో కుమార్తె జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా రెండుసార్లు పెళ్లి చేసుకొని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన శ్రీజ ప్రస్తుతం తన ఇద్దరు కూతుర్లను చూసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు.