Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరికొన్ని ప్రోమోలు విడుదలయ్యాయి అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ మొదటి సారి తన సిస్టర్స్ శ్రీజ, సుస్మిత గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సుస్మిత శ్రీజ ఇద్దరు కూడా చరణ్ గురించి మాట్లాడినటువంటి ఒక వీడియోని బాలకృష్ణ చూపించారు ఇందులో భాగంగా తన అక్క సుస్మిత మాట్లాడుతూ… ఇటీవల కాలంలో రామ్ చరణ్ ను చాలా మిస్ అవుతున్నామని తెలిపారు. గత కొద్దిరోజులుగా తనతో కలిసి సరదాగా గడపడానికి కూడా కుదరడం లేదని తెలియజేశారు. చరణ్ కి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా మేమంతా ఒకే ఇంట్లో ఉన్న తనతో కలిసి సమయాన్ని గడపలేకపోతున్నామని ఎమోషనల్ అయ్యారు.
ఇక శ్రీజ సైతం తన అన్నయ్య గురించి మాట్లాడుతూ చరణ్ అన్న నాకు పిల్లర్ లాంటివాడు నాకు ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే ఆ కష్టాన్ని తీర్చేస్తాడని శ్రీజ తెలిపింది. ఇక చరణ్ కోసం సుస్మిత ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా పంపించారు ఆ లెటర్ చరణ్ చదివి వినిపించారు. ఇక ఆ లెటర్లో 2025లో చరణ్ నీతో పాటు నేను, శ్రీజ మన ముగ్గురం కలిసి ఏదైనా వెకేషన్ కి వెళ్ళాలి. ఈ నా కోరికను కచ్చితంగా ఈ ఏడాది నెరవేరుస్తావని ఆకాంక్షిస్తున్నాను అంటూ లెటర్ రాయగా అది చదివిన చరణ్ తప్పకుండా నీ కోరికను నెరవేరుస్తాను అక్క అంటూ మాట ఇచ్చారు.
ఇక ఇంట్లో తన సిస్టర్స్ ఎలా ఉంటారు అనే విషయం గురించి చరణ్ మాట్లాడుతూ సుస్మిత అక్కకు కాస్త కోపం ఎక్కువ అందుకే అందరూ తనంటే కాస్త భయపడుతూ తన దగ్గర జాగ్రత్తగా ఉంటారని తెలిపారు. ఇక శ్రీజ మాత్రం ఎవరిని ఏది నాకిది కావాలి అంటూ నోరు తెరిచి అడగదు కానీ అమ్మ నాన్న ఏదైనా వెకేషన్ కి వెళ్తే మాత్రం మొత్తం గిఫ్ట్ బ్యాగులని శ్రీజ వద్దకే వెళ్తాయి. అప్పుడే అర్థమైంది ఏమీ అడగక పోతేనే అన్ని వస్తాయి అని అంటూ సరదాగా తన ఇద్దరి సిస్టర్స్ గురించి చరణ్ తెలియజేశారు.
