నువ్వు నా కుతూరివి కాదు.. రోజా ఎమోషనల్ పోస్ట్..!

అలనాటి సీనియర్ నటి రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రధాన పాత్రలలో నటించింది. ఇలా నటిగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లో అడుగు ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఎన్నో సార్లు పరాజయం ఎదుర్కొన్న రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత నగరి ఎమ్మెల్యేగా గెలుపొందింది. ఇలా ఒకవైపు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు జబర్దస్త్ కామెడీ షో కి 9 సంవత్సరాల పాటు జడ్జిగా వ్యవహరించింది.

ప్రస్తుతం రోజా అధికార పార్టీలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇక ఇక రోజా వ్యక్తిగత విషయానికి వస్తే దర్శకుడు సెల్వమణి ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కొడుకు. రోజా కూతురు అన్షు మాలిక కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. రోజా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన విశేషాలతో పాటు తన కుటుంబ విశేషాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల రోజా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సందర్భంగా రోజా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో రోజా కూతురు పుట్టినరోజున ” డియర్ అన్షు నువ్వు నా కూతురు మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు నీకు ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు మై డియర్” అంటూ సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం రోజా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కొందరు ప్రముఖులతో పాటు రోజా అభిమానులు కూడా అన్షు మాలిక కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.