ఘనంగా రాజీవ్ కనకాల పుట్టినరోజు వేడుకలు… రాజీవ్ కనకాల వయసు ఎంతో తెలుసా?

“కళ్యాణ ప్రాప్తిరస్తు” సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజీవ్ కరకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇలా సినిమాలలో సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించాడు.

ఇక ఇప్పటికీ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇక రాజీవ్ కనకాల 1968 నవంబర్ 13వ తేదీ ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన దేవదాస్ కనకాల, లక్ష్మి కనకాల దంపతులకు జన్మించాడు. ఇక మలయాళీ అమ్మాయి అయిన సుమ ని ప్రేమించి పెద్దలు అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. నిజానికి సుమ మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. పెద్ద పెద్ద హీరోలా సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు టీవీ షోలో యాంకర్ గా సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా ఇటీవల నవంబర్ 13వ తేదీ రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా సుమ తన భర్తతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు ని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కూడా పడవలో ప్రయాణిస్తూ టైటానిక్ తరహాలో ఫోజులిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాజీవ్ అభిమానులతో పాటు సుమ అభిమానులు కూడా రాజీవ్ కనకాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రాజీవ్ కనకాల కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.