కృష్ణంరాజు చివర వరకూ నెరవేరని కోరికలు ఇవే?

టాలివుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన నటులలో కృష్ణంరాజు కూడా ఒకరు. దాదాపు 183 సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన పాత్రలలో నటించిన కృష్ణంరాజు రెబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇలా సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా రాణించాడు. వాజ్ పాయ్ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కేంద్ర మంత్రిగా తన సేవలను ప్రజలకు అందించాడు. ఇలా ఇటు రాజకీయ నాయకుడిగా అటు హీరోగా ప్రజల ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు.

కృష్ణంరాజు మృతితో ఆయన కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. అయితే కృష్ణంరాజు మరణించే సమయానికి ఆయనకు ఉన్న ఐదు కోరికలు నెరవేర్చుకోలేకపోయాడు. కృష్ణంరాజు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో రాణించాడు. చివరి నిమిషం వరకు కృష్ణంరాజుకు మిగిలిపోయిన తీరని కోరికలు ఇవే.

కృష్ణంరాజు నటించిన భక్తకన్నప్ప సినిమాని ప్రభాస్ తో రీమేక్ చేయాలని అనుకున్నాడు. ఆ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ సినిమా ఎందుకు పట్టాలెక్కకుండా అని ఆగిపోయింది. కృష్ణంరాజు జీవితంలో నెరవేరకుండా మిగిలిపోయిన కోరికలలో ఇది కూడా ఒకటి.

అలాగె ప్రభాస్‌తో కలిసి ‘విశాల నేత్రాలు’ అనే నవలను సినిమాగా తెరకెక్కించాలని కృష్ణంరాజు అనుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. అయితే కారణాలవల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేకపోయింది.

చత్రపతి సినిమాలోని ఒకే ఒక్క అడుగు అనే డైలాగ్ ని టైటిల్ గా పెట్టి మల్టీ స్టార్ గా ఒక సినిమాని తీయాలని అనుకున్నాడు. ఈ సినిమాని గోపికృష్ణ బ్యానర్ పై రెండు వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎందుకో మరి ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

అలాగే కృష్ణంరాజు జీవితంలో నెరవేరకుండా ఆగిపోయిన అతిపెద్ద కోరిక ప్రభాస్ పెళ్లి. కృష్ణంరాజు మరణించే లోపు ప్రభాస్ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ప్రభాస్ తన కెరీర్ మీద దృష్టి పెట్టి పెళ్లిని నిర్లక్ష్యం చేయడంతో ప్రభాస్ పెళ్లి జరిగే లోపు కృష్ణంరాజు తుది శ్వాస విడిచాడు.

ప్రభాస్ కి పెళ్లి చేసి తనకి పుట్టిన పిల్లలతో కూడా నటించాలని కృష్ణంరాజు ఎంతో ఆశపడ్డాడు కానీ ఇలా ప్రభాస్ పెళ్లి జరగకుండానే అనారోగ్యంతో స్వర్గస్తులైనారు.