Keerthy Suresh: గత కొంత కాలంగా జరుగుతున్న పెళ్లి ప్రచారంపై అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ తాజాగా స్పందించారు. ఆ వార్తలను నిజం చేస్తూ.. వచ్చే నెలలో తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్నట్లు స్పష్టం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కీర్తి సురేశ్ సందర్శించుకున్న విషయం తెలిసిందే.
శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల కీర్తి సురేశ్ మాట్లాడారు. ఈ మేరకు పెళ్లి వార్తలపై స్పష్టతనిచ్చారు. గోవాలో తన పెళ్లి జరగనున్నట్లు ప్రకటించారు. అందుకే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై కీర్తి సురేష్ బుధవారం అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ప్రియుడు ఆంటోనీతో దీపావళి సందర్భంగా తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. తమ స్నేహబంధం జీవితాంతం కొనసాగనుందని తెలిపింది. ఈ వార్త తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు కీర్తి సురేష్‌కు శుభాకాంక్షలు అందజేశారు. ఇక రిపోర్ట్స్ ప్రకారం.. డిసెంబర్ 11, 12 తెదీల్లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనున్నట్లు తెలిసింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.