బాక్సాఫీస్ : 2 డేస్ “బేబీ” వరల్డ్ వైడ్ వసూళ్లు ఇవే.!

ఈ సమ్మర్ లో టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలూ తక్కువే అలాగే ఈ చిత్రాల్లో హిట్ రేషియో కూడా తక్కువ గానే ఉంది అని చెప్పాలి. అయితే గత మూడు వారాల్లో అయితే చిన్న సినిమా “సామజవరగమనా” మినహా మరో హిట్ కనిపించలేదు. ఇక ఈ వారం థియేటర్లు లోకి మంచి అంచనాలు వచ్చిన మరో చిత్రం “బేబీ”.

అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఇక మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 7 కోట్లు గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో రోజు కూడా ఇదే రీతి వసూళ్లతో మొత్తం 14.31 కోట్లకి పైగా గ్రాస్ ని 7 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్రం తెలంగాణాలో 5 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఏపీలో అయితే 6.5 కోట్ల పైగా గ్రాస్ ని అందుకుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి 2.8 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. దీనితో రెండు రోజుల్లో ఈ చిత్రం 14 కోట్లకి పైగా గ్రాస్ ని సెట్ చేసింది.

అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో 50 కోట్ల మార్క్ కి కూడా చేరుతుంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మార్క్ ని కూడా సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో అయితే ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అలాగే సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ కె ఎన్ నిర్మాణం వహించాడు.