ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో దంచికొడుతున్న సూపర్ డూపర్ బాక్సాఫీస్ హిట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది చిన్న చిత్రం “బేబీ” అనే చెప్పాలి. ఈ చిత్రం స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా మేకర్స్ గట్టి నమ్మకంతో ఉండగా రిలీజ్ కంటే ముందే దర్శకునిగా మేకర్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారు.
మరి అంత నమ్మకం మధ్య కొన్నాళ్ల గ్యాప్ తర్వాత అయితే ఫైనల్ గా రిలీజ్ చేసిన ఈ చిత్రం సీన్ కట్ చేస్తే అంతకు మించే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని కొల్లగొట్టి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడప్పుడే స్లో అయ్యేలా కనిపించట్లేదు దీనితో ఇప్పటికీ సినిమా థియేటర్స్ లో చూడకుండా ఓటిటి లో వచ్చాక చూద్దాంలే అనుకునే వారు కూడా లేకపోలేరు.
అయితే వారి కోసం అయితే ఓ బాడ్ న్యూస్ ఇప్పుడు తెలుస్తుంది. బేబీ కనబరుస్తున్న పెర్ఫామెన్స్ తో నాలుగు వారాల్లో ఓటిటి లో వచ్చే ఛాన్స్ లేదట ఎలా లేదన్నా ఈ చిత్రం ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలోనే ఓటిటి లో రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని ఆహా వారు సొంతం చేసుకోగా..
అందులో ఈ చిత్రం ఆగష్టు చివరి రెండు వారాల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తారని ఇపుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దీనితో బేబీ ఓటిటి ఎంట్రీ ఇప్పుడప్పుడే ఉండదని చెప్పి తీరాలి. కాగా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అలాగే సాయి రాజేష్ దర్శకత్వాన్ని వహించాడు.