అఫీషియల్ – “బేబీ” ఓటిటి రిలీజ్ పై క్లారిటీ.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఒకో నెలలో ఒకో సెన్సేషనల్ హిట్ వస్తుంది అని చెప్పాలి అయితే ఈ చిత్రాల్లో ఇదే జూన్ లో మరింత భారీ హిట్స్ బాక్సాఫీస్ దగ్గర రాగా ఈ చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన కల్ట్ లవ్ స్టోరీ చిత్రం “బేబీ” కూడా ఒకటి.

దర్శకుడు సాయి రాజేష్ యంగ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఇప్పుడు పెద్ద సినిమా బ్రో ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అదిరే వసూళ్లు రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పటికీ..

ఈ చిత్రం కూడా ఇతర చిన్న సినిమాల్లానే ఓటిటి లో కూడా త్వరగా వచ్చేస్తుంది అని రూమర్స్ వచ్చాయి. అయితే దీనిపై గతంలోనే మేము ఈ చిత్రం ఇప్పుడప్పుడే రాదని కన్ఫర్మ్ చేసాం. కానీ లేటెస్ట్ గా కొన్ని రూమర్స్ ఈ చిత్రం అగస్ర్ మధ్యలోనే వచ్చేస్తుంది అని టాక్ రాగ.

దీనిపై నిర్మాత ఎస్ కె ఎన్ కూడా రెస్పాన్స్ అయ్యి ఈ చిత్రం ఓటిటి లో అప్పుడే రావట్లేదని కన్ఫర్మ్ చేసాడు. దీనితో బేబీ చిత్రం ఓటిటి రిలీజ్ పై వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఏ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ లో పాల్గొంటున్నారు.