అంత పోటీలో కూడా బుల్లితెరపై దుమ్ము లేపిన “బేబీ”

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో యంగ్ నటీ నటులు ఆనంద్ దేవరకొండ అలాగే విరాజ్ ఆనంద్ లు హీరోలుగా యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య లు హీరోయిన్స్ గా దర్శకుడు సాయి  రాజేష్ తెరకెక్కించిన చిత్రం “బేబీ” కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం తెలుగు సినిమా దగ్గర భారీ విజయాన్ని సాధించగా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దీనితో బిగ్ స్క్రీన్ మీద ఎంతో పేరు తెచ్చుకున్న ఈ సినిమా రీసెంట్ గానే టెలివిజన్ లో కూడా ప్రసారం కి వచ్చింది.

కాగా ఈ సినిమా సాటిలైట్ హక్కులు ఈటీవీ వారు సొంతం చేసుకోగా బేబీ చిత్రం గత వారం ముందు టెలికాస్ట్ అయ్యింది. అయితే ఇదే టెలికాస్ట్ సమయంలో నాచురల్ స్టార్ నాని బిగ్ హిట్ “దసరా” అలాగే యంగ్ హీరో శ్రీ విష్ణు ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సామజవరాగమన” చిత్రాలు కూడా అదే సమయానికి బేబీ తో పాటుగా ఫస్ట్ టైం టెలికాస్ట్ కి వచ్చాయి.

దీనితో ఇంత గట్టి పోటీలో కూడా బేబీ సినిమా మిగతా అన్ని సినిమాలు కంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ తీసుకుంది. కాగా దసరా సినిమాకి 4.99 రేటింగ్ రాగా సామజవరాగమన కి 2 రేటింగ్ వచ్చింది. కానీ బేబీ మాత్రం 5.89 రేటింగ్ నమోదు చేసింది. దీనితో బుల్లితెరపై కూడా బేబీ సంచలనం నమోదు చేసింది అని చెప్పాలి. దీనితో మరోసారి బేబీ ట్రెండింగ్ లోకి వచ్చింది.