“బేబీ” ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఈసారి వదలకూడదా 

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువే ఉంటుంది అని చెప్పాలి. ఆల్ మోస్ట్ చాలా సినిమాలు మంచి విజయాలు సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కి అయితే భారీ నష్టాలు ఎక్కువగా ఏ సినిమాలు మిగల్చలేదు. ఈ ఏడాదిలో ఒక్క ఏజెంట్ మినహా మిగతా చాలానే సినిమాలు భారీ లాభాలు అందించగా ఈ చిత్రాల్లో అయితే లేటెస్ట్ గా వచ్చిన ఓ చిన్న చిత్రం వండర్స్ సెట్ చేసింది.

చాల తక్కువ హైప్ తోనే వచ్చినప్పటికీ మేకర్స్ పెట్టుకున్న అంచనాలు మించి భారీ వసూళ్లు కొల్లగొట్టి రికార్డు లాభాలు అందించింది. మరి ఆ చిత్రమే “బేబీ”. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు.

మరి యూత్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అయిపోయిన ఈ చిత్రం “బ్రో” లాంటి పెద్ద సినిమా వచ్చినా కూడా సూపర్ రన్ ని కంటిన్యూ చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో ఫ్యాన్స్ అయితే మరో గుడ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేకర్స్ అయితే సినిమా ఎక్స్ టెండెడ్ వెర్షన్ ని థియేటర్స్ లో వదిలారు.

ఇక ఇందులో చాలా కీలక సన్నివేశాలు అలాగే ఓ కొత్త పాటను కూడా యాడ్ చేసి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో బేబీ లో ఈరోజు నుంచి అదనపు సన్నివేశాలు కూడా ప్రదర్శితం కానున్నాయి. మరి వాటికోసం అయినా మరోసారి ఈ సినిమా చూడాల్సిందే అని చెప్పాలి.