Vasan Bala: ఆమెతో పనిచేస్తే మాయలో పడిపోవాల్సిందే..! : దర్శకుడు వాసన్‌బాల

Vasan Bala: ‘అలియాభట్‌ ఓ మాయ.. ఒక్కసారి ఆమెతో పనిచేస్తే ఆ మాయలో ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె ఆరా మనల్ని కూడా కమ్మేస్తుంది.’ అంటున్నారు దర్శకుడు వాసన్‌బాల. ఇటీవలే అలియాతో ఆయన ‘జిగ్రా’ సినిమా తెరకెక్కించారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా.. అలియాతో పనిచేశానన్న తృప్తి మాత్రం ‘జిగ్రా’ వల్ల లభించిందని ఆయన అన్నారు.

‘ ‘జిగ్రా’ సీరియస్‌ సబ్జెక్ట్‌. ఆ కథలో కామెడీ లేదు. కానీ సెట్‌ అంతా ఎప్పుడు కామెడీగా ఉండేది. కారణం అలియాభట్‌. తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఓ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం అలియా స్పెషాలిటీ. ఆమెతో ఒక్కసారి పనిచేశాక.. మళ్లీ ఇంకొకరితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే తనే గుర్తుకొస్తుంటుంది..’ అంటూ మాట్లాడారు వాసన్‌బాలా. దీనిబట్టి అలియా మాయ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.