Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి మనందరికీ తెలిసిందే. తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్. బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. సినిమాలో నటించినది కొద్దిసేపు అయినప్పటికీ బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ని 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అదే ఏడాది ఈ దంపతులకు రాహా అనే కూతురు కూడా జన్మించింది. ఇప్పటికే ఈ చిన్నారికి రెండేళ్ళు పూర్తి అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆలియా భట్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే అలియా రెండోసారి గర్భం దాల్చింది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ఆలియా హాజరైనప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలయ్యాయి. పైగా జిమ్ కు వెళ్లినప్పుడు కూడా కెమెరాలు కనిపించగానే ఎవరినీ పలకరించకుండా హడావుడిగా వెళ్లి కారులో కూర్చునేది. దీంతో నిజంగానే ఆలియా ప్రెగ్నెంట్ అయిందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కానీ లేటెస్ట్ వీడియోతో వాటికి క్లారిటీ వచ్చేసింది. అవన్నీ కూడా వట్టి పుకార్లే అని తేలిపోయాయి. ఆల్ఫా సినిమా కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేసిన ఆలియా తాపీగా వెళ్లి కారెక్కింది. మధ్యలో అక్కడున్న వారిని కూడా పలకరించింది. పైగా తనకు పొట్ట కూడా లేకపోవడంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే.. ఆలియా ప్రస్తుతం ఆల్ఫా మూవీ చేస్తోంది. ముంజ్య హీరోయిన్ శార్వరితో కలిసి నటిస్తున్న ఈ మూవీ క్రిస్‌మస్ కు విడుదల కానుంది.