Alia Bhatt: అలియా భట్ కి నేషనల్ అవార్డు… జీర్ణించుకోలేకపోయానన్న నటి సారా!

Alia Bhatt: అలియా భట్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమెకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా తన నటనతో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇక ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు నటుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ దంపతులు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అలియా భట్ తెలుగులో RRR సినిమాలో సీత పాత్రలో నటించారు. ఈ సినిమా ద్వారా ఈమెకు తెలుగులో మరింత గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా నటి అలియాకు ఇటీవల నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ నేషనల్ అవార్డు గురించి మరొక నటి సారా అలీ ఖాన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా అలీ ఖాన్ మాట్లాడుతూ… అలియాకు నేషనల్ అవార్డు రావడానికి తాను జీర్ణించుకోలేకపోయాను అని తెలిపారు.

అలియా భట్ ప్రస్తుతం ఎంతో ఆనందంగా ఉంది.సినిమాల విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె సంతోషంగా జీవిస్తున్నారు. ఈ స్థాయికి రావడం కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ.. ఆమెకు జాతీయఅవార్డు వచ్చినప్పుడు ఒక నటిగా నేను అసూయ పడ్డాను. అలాంటి సినిమాలో నాకు అవకాశం ఎందుకు రాలేదనిపించింది.

ఇలా ఎదుటివారిని చూసి అసూయ పడటం సర్వసాధారణం కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ఆ కష్టాన్ని ఎవరూ చూడరు. అవార్డును మాత్రమే చూస్తారు. నేనూ అలానే భావించాను అంటూ అలియా నేషనల్ అవార్డు గురించి సారా అలీ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఆలియా గంగుబాయి కతియవాడి సినిమాలోని తన నటనకు గాను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.