వైరల్ : ఈ క్లిప్ తో దొరికేసిన రష్మికా – విజయ్ ల రిలేషన్.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు యంగ్ హీరో హీరోయిన్స్ లలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు మంచి హిట్ కాగా ఈ చిత్రాల తర్వాత వీరిద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నారని ప్రేమలో ఉన్నారని పలు రూమర్స్ అయితే వినిపించాయి.

మరి కొన్ని వారాల కితమే ఈ ఇద్దరు కూడా మాల్దీవ్స్ కి కూడా వెళ్లినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఎవరికి వారు సెపరేట్ గా వెళ్లినట్టు వారు అప్పుడు చిత్రీకరించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ కలిసే వెళ్లారు ఒకే దగ్గర ఉన్నారు అనే దానికి ప్రూఫ్ దొరికేసింది.

లేటెస్ట్ గా సోషల్ మీడియాలో రష్మికా పై ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఆమె తన ఇన్స్టా లో ఓ లైవ్ ఇవ్వగా అందులో బాగా వింటే విజయ్ దేవరకొండ వాయిస్ కూడా ఆమెకి కొంచెం దూరం లో ఉన్నట్టుగా వినిపిస్తుంది. దీనితో ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం అయితే నిజమే అన్నట్టు అర్ధం అవుతుంది.

కాగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమా చేస్తుండగా రష్మికా నటించిన చిత్రం వారిసు రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నెక్స్ట్ పుష్ప 2 లో జాయిన్ కానుంది.