అప్పు మరణం : కళ్ళు తెరుచుకున్న తెలుగు హీరోల ఫ్యాన్స్

నిన్న ఎవరూ ఊహించని విధంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక గుండెపోటు కారణంగా తన తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియన్ సినిమాను శోక సంద్రంలో ముంచేసిన అప్పు మరణ వార్త తెలుగు హీరో అభిమానుల్లో కూడా ఒక కనువిప్పుని కలిగించినట్టు అయ్యింది. పునీత్ నిజానికి చాలా ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.

అలానే రోజు వారీలానే జిమ్ లో తన కసరత్తులు స్టార్ట్ చేసాడు కానీ ఆ సమయంలోనే సడెన్ స్ట్రోక్ రావడంతో పెద్దగా వ్యవధి లేకుండా కన్ను మూసాడు. ఇది నిజంగా చాలా బాధాకరం దీనితో ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్నది ఎవరూ చెప్పలేము అనే అంశం ప్రతీ ఒక్కరూ గుర్తించారు.

దీనితో మన తెలుగు హీరోల అభిమానులు పునీత్ గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఇన్ని రోజులు ఒక హీరో అభిమానులు మరొక హీరోల అభిమానులను హీరోలను దూషిస్తూ కాలయాపన చేశారు కానీ అప్పు మరణ వార్త విని ఒక్కసారిగా చలించిపోయిన వీరు ఒకవేళ ఇదే మన హీరోలకు ఎదురైతే? అనే ప్రశ్న వేసుకున్నారు.

దీనితో ఇక నుంచి తమలో తమకు ఎలాంటి ఫ్యాన్ వార్స్ వద్దు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం అంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అయితే ఇది ఎన్నాళ్ళు ఉంటుందో కానీ అప్పు చేసిన ఎన్నో మంచి పనులలో ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి పనిలా పరోక్షంగా మిగులుతుంది అని చెప్పాలి.