తమలోని యాక్టర్ ను తొక్కిపెడుతున్న నలుగురు టాలీవుడ్ స్టార్స్ వీళ్లే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆరుగురు స్టార్ హీరోలు టాప్ రేంజ్ లో ఉన్నారు. ఈ ఆరుగురు హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు. అయితే టాలెంట్ ఉన్నా స్టార్ హీరోలుగా గుర్తింపు ఉన్నా కొంతమంది హీరోలు తమలోని యాక్టర్ ను తొక్కిపెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తమలోని యాక్టర్ ను తొక్కిపెడుతున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు హిట్టయ్యాయి. అయితే ఎన్టీఆర్ రేంజ్ నటన ఏ సినిమాలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆది, సింహాద్రి స్థాయిలో ఎన్టీఆర్ యాక్టింగ్ ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ రేంజ్ కు తగిన సన్నివేశాలు ఉన్నా ఆ సన్నివేశాలు పరిమితంగా ఉండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఒకింత హర్ట్ చేసిందనే చెప్పాలి.

మరో స్టార్ హీరో మహేష్ బాబుకు సైతం ఈ మధ్య కాలంలో యాక్టింగ్ టాలెంట్ ను పూర్తిస్థాయిలో ప్రదర్శించే సినిమా దొరకలేదనే చెప్పాలి. పోకిరి, దూకుడు సినిమాలలో మహేష్ యాక్టింగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మహేష్ యాక్టింగ్ టాలెంట్ ను మళ్లీ ఎప్పుడు చూపిస్తారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ టాలెంట్ ను పూర్తిస్థాయిలో చూపించిన సినిమాలలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాలు ముందువరసలో ఉంటాయి.

అయితే రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలలో నటిస్తున్న పవన్ కు ఆ సినిమాలతో యాక్టర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం లేదు. గబ్బర్ సింగ్ రీమేక్ అయినా ఆ సినిమా కథ పవన్ కోసమే అనేలా ఉంటుంది. పవన్ కూడా తనలోని గొప్ప నటుడిని తొక్కిపెడుతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో స్టార్ హీరో ప్రభాస్ కు కూడా బాహుబలి సిరీస్ తర్వాత ఆ స్థాయిలో యాక్టింగ్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కలేదు.