Will smith : ఈసారి ఆస్కార్ వేడుకల్లో ఏ సినిమాకు ఏమి అవార్డు వచ్చింది. ఏ నటులకు అవార్డు వచ్చింది. రెడ్ కార్పేట్ పై తారలు ఇలా హొయలు ఒలికారు వంటివేవి మీడియాలో రాలేదు. ఒకేఒక వార్త మీడియా మొత్తం హైలైట్ అయింది.ఆస్కార్ అవార్డ్స్ గురించి పెద్దగా తెలియని, చూడని, పట్టించుకోని వాళ్ళు కూడా ఆస్కార్ న్యూస్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు. అసలు అంతలా ప్రపంచవ్యాప్తంగా అందరిని షాక్ కు గురిచేసిన ఆ సంఘటన విల్ స్మిత్ వేదిక పై ఉన్న క్రిస్ రాక్ ను చెంప దెబ్బ కొట్టడం.
విల్ స్మిత్ భార్య జడే పింకెట్ జుట్టు పై జోకు వేసినందుకు విల్ స్మిత్ క్రిస్ రాక్ ను కొట్టాడు. విల్ స్మిత్ భార్యకు జబ్బుచేయడం వల్ల తన జుట్టు బాగా రాలిపోయింది ఈ విషయాన్నీ ఆమె స్వయంగా మీడియాకు పేర్కొన్నారు. ఇక ఆ విషయం పై జోక్ చేయడం తో స్మిత్ కొట్టాడు.ఇక ఆ తర్వాత స్మిత్ ఆస్కార్ అకాడమీకి క్రిస్ రాక్ కు క్షమాపణలు చెప్పారు.అయితే ఈ ఉదంతం అక్కడితో అయిపోలేదు ఆస్కార్ అకాడమీ ఎలాంటి సంఘటనలను ఉపేక్షించదు. విల్ స్మిత్ పై అకాడమీ 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది.
ఏప్రిల్ 8, 2022 నుండి 10 సంవత్సరాల కాలానికి, మిస్టర్. స్మిత్ అకాడమీ అవార్డులతో సహా, వ్యక్తిగతంగా ఎటువంటి అకాడమీ ఈవెంట్‌లు లేదా ప్రోగ్రామ్‌లకు హాజరు కావడానికి అనుమతించరాదని బోర్డు నిర్ణయించింది” అని ఆస్కార్ విభాగం లేఖను విడుదల చేసింది. విల్ స్మిత్ తదుపరి దశాబ్దంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించే ఏ ఇతర ఈవెంట్‌లకు హాజరు కావడానికి కూడా అనుమతి లేదు. ఇక స్మిత్ గెలుచుకున్న ఉత్తమ నటుడు అవార్డును రద్దు చేయలేదు. భవిష్యత్తులో ఆస్కార్ నామినేషన్లపై ఎటువంటి నిషేధాన్ని పేర్కొనలేదని వార్తా సంస్థ AFP నివేదించింది. విల్ స్మిత్ ఈ ఏడాది ఉత్తమం నటుడిని గా అస్కార్ అందుకున్నాడు.