వాడకం అంటే ఇది: లూటో.. లూటో…!

ట్రిపుల్ ఆర్ లోని నాటునాటు సాంగ్ కు ఆస్కార్ వేదికగా అవార్డ్ రావడంతో అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ పాటను అనుకరించి మీమ్స్ ట్రోల్స్ చేస్తూ ప్రత్యర్థుల పని పడుతున్నారు. ఈ విషయంలో ఈ అవార్డును పుష్కలంగా వాడేసే పనిలో ఉన్న బీఆరెస్స్.. ఈ సినిమాను విడుదల కానివ్వమని, థియేటర్ల దగ్గర కనిపిస్తే బరిసెలతో కొడతామని చెప్పిన బండి సంజయ్ పైనా – ఆస్కార్ నామినేషన్ కు ఆర్.ఆర్.ఆర్. ని పంపకుండా గుజరాత్ సినిమాను పంపిన మోడీపైనా ఒక రేంజ్ లో విమర్శలు చేస్తుంటే.. ఇక నెటిజన్లు అయితే ఒక్క రేంజ్ లో ఆడుకుంటున్నారు.

బీఆరెస్స్ సంగతి అలా ఉంటే… ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా “నాటు నాటు” ను “లూటో లూటో” అంటూ ఫుల్ గా వాడేసింది. వాడకం అంటే ఇది కదా అన్న స్థాయిలో ఎన్టీఆర్ – రాం చరణ్ ప్లేసులో మోడీ – అదాని తలలు అమర్చి ట్రోల్స్ మొదలుపెట్టింది.

అవును… సరైన సెటైర్ వేస్తే సమ్మాగా దిగిపోవాలి అంటారు. ప్రస్తుతం నాటు నాటు పేరు చెప్పి లూటో లూటో అంటూ కాంగ్రెస్ పార్టీ.. బీజేపీకి అదే పనిచేసింది. ఎన్టీఆర్ – రాంచరణ్ స్టెప్పులేసిన ఫొటోకు ప్రధాని మోడీ, పారిశ్రామికవేత్త అదానీ ఫొటోలను ఎడిట్ చేసి “నాటునాటు”కు బదులు “లూటో లూటో” అని మార్చి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.