కాజల్ కే ఎందుకిలా అవుతుంది?

కాజల్ అగర్వాల్ ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళ్ లో దాదాపు అందరి స్టార్ హీరోస్ తో నటించిన కాజల్ కెరీర్ ఇప్పుడు ఆశించినంతగా లేదు. ముప్పైలోకి వచ్చాక కాజల్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో తో నటించింది. హీరోయిన్ల కొరత ఉండడంతో చిరంజీవి ‘ఆచార్య’ లో తనకు జోడిగా కాజల్ ని తీసుకున్నారు. ఆమె పై కొంత షూటింగ్ చేసాక సడన్ గా సినిమాలో ఆమె పాత్రను మొత్తం తీసేసారు.

ఇప్పుడు కాజల్ ని ఒక సినిమా కోసం సైన్ చేసుకున్నాక కూడా ఆమెను తొలిగించినట్టు సమాచారం. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న   ‘ఇండియన్ 2 ‘ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయిందని.. షూటింగ్ కూడా వెళ్లబోతున్నానని అఫీషియల్ గా పోస్ట్ చేసింది.

అయితే తాజా  సమాచారం ప్రకారం కాజల్ ఈ సినిమా నుంచి తప్పించినట్లు కోలీవుడ్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దానికి కారణం కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2 ‘ సినిమాకి సైన్ చేసే  టైంలో చాలా హాట్ గా ఉంది, కానీ ఇప్పుడు కాజల్ అగర్వాల్ లుక్స్ పెద్దగా చెప్పుకునే విధంగా లేవు . డెలివరీ అయిన తరువాత కాజల్ తన బాడీని కరెక్ట్ షేపులో పెట్టడానికి ఇంకా శ్రమిస్తూనే ఉంది.

కానీ అంత టైం డైరెక్టర్ శంకర్ ఆమెకు ఇవ్వట్లేదు. ఈ కారణంతోనే కాజల్ సినిమా నుంచి తప్పించి మరో యంగ్ బ్యూటీ హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్నారట.