అల్లు ఫ్యామిలీకి ఆ హీరోయిన్ అంటే ఎందుకంత ఇష్టం… ఫ్యామిలీ మొత్తం ఆమె భజనేనా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఏ విధమైనటువంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.అల్లు రామలింగయ్య వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి నిర్మాతగా వచ్చి ఎంతో సక్సెస్ సాధించారు. ఇక ఈయన వారసుల ముగ్గురు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. బాబీ నిర్మాతగా కొనసాగగా, అల్లు అర్జున్, శిరీష్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.

ఇకపోతే ఈ మధ్యకాలంలో అల్లు ఫ్యామిలీ మొత్తం ఒకే హీరోయిన్ పేరు భజన చేస్తూ కనిపించడంతో ఎందుకు అల్లు కుటుంబానికి ఆ హీరోయిన్ అంటే అంత స్పెషల్ అని చర్చలు మొదలయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ నుంచి మొదలుకొని శిరీష్ అల్లు అరవింద్ వంటి వారు కూడా ఆ హీరోయిన్ భజన చేయడం గమనార్హం.ఇంతకీ అల్లు అర్జున్ ఫ్యామిలీకి అంతగా నచ్చినటువంటి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే….

అల్లు ఫ్యామిలీ మనసు పారేసుకున్నటువంటి హీరోయిన్ మరెవరో కాదు నటి అనుపమ పరమేశ్వరన్.ఈమె తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో 18 పేజీస్ సినిమాలో నటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అల్లు అర్జున్ అనుపమ గురించి పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు.ఇక అల్లు అరవింద్ అయితే ఇలాంటి కూతురు నాకు ఉంటే బాగుండేదని ఆమె గురించి పొగడ్తలు చెప్పారు. మరోవైపు శిరీష్ తన సినిమాలో అనుపమ హీరోయిన్ గా ఉండాలని కూడా కోరుకున్నారు. ఇలా అల్లు ఫ్యామిలీని మొత్తం అనుపమ తన మాయలో పడేసుకుందని చెప్పాలి.