Bigg boss 4: నో డౌట్.. బిగ్ బాస్ విన్నర్ అతడేనట.. ప్రేక్షకులకు కూడా తెలిసిపోయింది?

Who will be the bigg boss 4 telugu winner

బిగ్ బాస్ 4.. ప్రస్తుతం ఈ షో రంజుమీదుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ షోకు బాగానే కనెక్ట్ అయ్యారు. ప్రతి వారం… బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది? ఎవరు కెప్టెన్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనేదానిపై ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంటోంది.

Who will be the bigg boss 4 telugu winner
Who will be the bigg boss 4 telugu winner

అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఎంతమంది ఉన్నా… మిగిలేది మాత్రం ఒక్కరే. ఒక్కరికే బిగ్ బాస్ విన్నర్ అయ్యే చాన్స్ ఉంది. అయితే.. 16 మందిలో ఆ ఒక్కరు ఎవరు? అనేదానిపై ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంది. హౌస్ లోకి వచ్చింది 16 మంది. అందులో విన్ అయ్యేది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరో తెలిసిపోయింది.

నిజానికి ఇది సస్పెన్స్ గానే ఉండాలి కానీ.. ఆ ఒక్కరు ఎవరు అనే విషయాన్ని ప్రేక్షకులు ముందే పసిగట్టేశారు. ఈసారి అభిజీత్ కే బిగ్ బాస్ ట్రోఫీని అందించాలని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారట.

ఎందుకంటే.. మిగితా కంటెస్టెంట్లు బలాన్ని ప్రయోగిస్తే.. అభిజీత్ మాత్రం బుద్ధిని ప్రయోగిస్తాడు. ఏ టాస్క్ వచ్చినా కూడా గేమ్ ను ఎంతో లాజిక్ గా ఆలోచించి ఆడుతాడు. ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉంటాడు. ఏమాత్రం తొందరపడడు. ఎవరినైనా ఏదైనా అనాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు. మొత్తం మీద అభిజీత్ వేసే ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తూ ఆటను ముందుకు సాగిస్తున్నాడని… అందుకే ప్రేక్షకులు కూడా అభిజీత్ కే పట్టం కట్టాలని భావిస్తున్నారట.

నిజం చెప్పాలంటే మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం అభిజీత్ నామినేట్ అవుతూ వచ్చాడు. అన్నిసార్లు నామినేట్ అయినా కూడా అభిజీత్ నే ఫస్ట్ సారి సేవ్ చేస్తూ వస్తున్నారు ప్రేక్షకులు.

ఇక.. గత వారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది 8 మంది మాత్రమే. ఇప్పుడే గేమ్ ఇంకా ఆసక్తిగా మారనుంది. అయితే.. ఇంకో ముగ్గురు ఎలిమినేట్ అయితే టాప్ 5 కంటెస్టెంట్లతో చివరి దాకా బిగ్ బాస్ గేమ్ ఆడే అవకాశం ఉంది. చూద్దాం మరి.. ప్రేక్షకులు నిజంగానే అభిజీత్ ను విన్నర్ చేస్తారా? లేదా? అనేది.