ఆమె ఓ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్.! బొద్దుగుమ్మ కూడా.! ఆ బొద్దుతనం వల్లనే అవకాశాలు తగ్గిపోయాయ్. ఇప్పుడేమో నిర్మాతగానూ ట్రై చేస్తోంది. తన సినిమాకి తానే నిర్మాత.! ఎక్కడి నుంచో వచ్చి, ఇక్కడ నిర్మాతగా మారిపోయిందామె. అందులో తప్పేముంది.? కాకపోతే, తెరవెనుకాల ఓ యంగ్ హీరో నుంచి నిర్మాణ పరంగా సహాయ సహకారాలు అందుతున్నాయట.
పిల్లికి కూడా బిచ్చం పెట్టని ఆ యంగ్ హీరో, ఈ హీరోయిన్‌కి ఉచిత సలహాలిచ్చి నిర్మాతగా మార్చాడట. అద్గదీ అసలు సంగతి. ‘అంతా నేనే..’ అని చెప్పుకుంటున్నాడట ఆ యంగ్ హీరో. కాకపోతే, సీన్‌లో ఎక్కడా కనిపించడంలేదు.
వ్యవహారం తేడా కొడితే, తన పరువు పోకూడదని ఇలా ప్లాన్ చేశాడా.? అలాగైతే, ‘అంతా నేనే’ అని ఎందుకు చెప్పుకుంటున్నట్టు.? అంటే, సినిమాలో విషయం వుందట. అద్గదీ అసలు సంగతి.