KGF Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కినకేజీఎఫ్, కేజీఎఫ్2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో మనకు తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజిఎఫ్2 సంచలన రికార్డులను సృష్టిస్తోంది.కోలార్ గనులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఒక వ్యక్తి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించారని పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. ఈ రియల్ రాకీ భాయ్ పేరు థంగం అని సమాచారం.
ప్రస్తుతం ఈ రియల్ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఈయన ఎవరు ఆయన కథ ఏమిటి అనే విషయానికి వస్తే 1990లో కోలార్ గనులలో పనిచేసిన ఈయన అక్కడ ఒక చిన్న గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ బంగారు గనుల నుంచి బంగారాన్ని దొంగలిస్తూ ప్రజలకు పంచేవాడు. ఇలా తనకు ఎవరైనా అడ్డు వస్తే దారుణంగా వారిని హత్య చేయడానికి కూడా వెనకాడే వారు కాదు. ఈ విధంగా అక్కడ దోచి ప్రజలకు పెట్టడంతో ఇతనిని మరో వీరప్పన్ అనీ అందరూ భావించేవారు.
ఇలా ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే ఏకంగా 40 కి పైగా అతనిపై దోపిడీ కేసులు నమోదు అయ్యాయి. ఈ విధంగా ఈ వ్యక్తి 1997వ సంవత్సరంలో తిరుపతి సమీపంలో పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ కి గురయ్యారు. ఈ విధంగా ఈ వ్యక్తి నిజజీవితంలో జరిగిన సంఘటనలను ప్రశాంత్ నీల్ సినిమాగా తెరకెక్కించారని థంగం తల్లి డైరెక్టర్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తన కొడుకు పాత్రను చాలా నెగిటివ్ గా చూపించారని,ఇదే విషయంపై తాను చట్టపరంగా ముందుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.