Sudigali Sudheer: సుధీర్‌ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న అమ్మాయి ఎవరు….ఆమె పేరేంటో తెలుసా?

Sudigali Sudheer: బుల్లితెరపై చాలా క్రేజ్‌ ఉన్న ఆర్టిస్టులలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. జబర్దస్త్ కామెడీ షోలో చిన్న ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్.. అంతకు ముందు మ్యాజిషియన్‌గా కూడా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా తన సొంత టాలెంట్‌తో పైకి వచ్చి ప్రస్తుతం చాలా మంది టీవీ ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు సుధీర్‌. అంతే కాకుండా మరెంతో మంది ఆయన్ని రోల్‌మోడల్‌గా కూడా తీసుకుంటారు.

అయితే తాజాగా ఓ షోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకు ముందు షోల పేరుతో సుధీర్, రష్మీలకు కూడా ఈ తరహాలోనే ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. అదంతా నిజం కాదని తెలిసినా… ప్రేక్షకులు మాత్రం ఎప్పటికైనా వారిద్దరూ ఒకటవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సుధీర్ ఎంగేజ్‌మెంట్ అంటూ విడుదలైన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ఆ వీడియోలో ఉన్నది ఉన్న అమ్మాయి ఎవరు ? ఏం చేస్తుంది? లాంటి విషయాలకొస్తే ఆమె పేరు తేజస్వీ నాయుడు. మోడల్‌గా చేస్తూ పలు యాడ్స్‌లో కూడా నటించిందట. అయితే ఇప్పటివరకు తను పెద్దగా లైమ్‌లైట్‌లోకి రాలేదు. కానీ తాజాగా సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా వీడియో బయటికి వచ్చిన తర్వాత తాను ఎవరా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ అమ్మాయి సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయా, కాదా అన్న తెలియాల్సి ఉండగా.. ఇంతకాలం సుధీర్‌ ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడా అనే సందేహాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఎంగేజ్‌మెంట్ నిజమా.. కాదా అని తెలియాలంటే ఈ షో విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.