Subhashree: డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నానని అన్నారు.. ఆ ట్రోల్స్ వల్ల చాలా బాధపడ్డాను : శుభశ్రీ రాయగురు

Subhashree : శుభశ్రీ రాయగురు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది శుభశ్రీ. అంతకుముందు సోషల్ మీడియా ద్వారా కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే శుభశ్రీ ఇటీవలే నటుడు నిర్మాత అయిన అజయ్ కుమార్ మైసూర్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇతను ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. అంతే కాకుండా అజయ్ మైసూర్ ఆస్ట్రేలియాలో బాగా డబ్బున్న తెలుగువాళ్ళల్లో ఒకరు. లగ్జరీగా బతుకుతూ ఉంటారు.

దీంతో అజయ్ ని శుభశ్రీ నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె డబ్బుల కోసమే చేసుకుంది. నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది. డబ్బుల కోసమే అంటూ పలువురు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేసారు. అంతేకాకుండా వారి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కింద కూడా నెగిటివ్గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెగిటివ్గా కామెంట్స్ పట్ల స్పందించింది శుభశ్రీ.. నల్లగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని చేసుకుంటున్నారు అని కామెంట్స్ చేసారు. మీకు ఎంత ధైర్యం? అసలు మీరెవరు నా లైఫ్ లో ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు డబ్బు ఉన్నవాళ్లు.

నా దగ్గర డబ్బు ఉంది, కార్, ఇల్లు ఉంది. అయినా ఇండియాలో చాలా మంది అబ్బాయిలు నల్లగానే ఉంటారు. లావు ఉన్నాడని కామెంట్స్ చేసారు. ఆయన మంచి ఫుడీ. జిమ్ కి వెళ్తే తగ్గుతారు. ఆయనకు అలా ఉండటం ఇష్టం, మీకెందుకు. నేను అబ్బాయి మంచిగా ఉన్నాడా, రెస్పెక్ట్ ఇస్తున్నాడా, టాక్సిక్ లేడా ఇలాంటివి చూస్తా. ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఈ 9 నెలల్లో ఎక్కువగా ఏడవలేదు. ఆయన నాతో మంచిగా ఉంటారు. నన్ను ఏడిపించట్లేదు. ఆ ట్రోల్స్ చూసాను. నా వల్ల కాదు అని అవాయిడ్ చేశాను. ఆయనకు కూడా ఇలాగే చెప్తున్నారు. నాకేం డబ్బులు ఆయన ఇవ్వట్లేదు. నేను ఆయనకు ఇవ్వట్లేదు. మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నాము. నిశ్చితార్థంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తే ఆయనకు డ్యాన్స్ రాదు అని ట్రోల్ చేసారు. ఆయనకు వచ్చినట్టు ఆయన చేస్తారు నీకెందుకు. మాకు ఇవన్నీ అనవసరం. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము. అలాంటి వాళ్లకు ఏం చెప్పలేము. ట్రోల్ చేసినవాళ్లు వాళ్ళ పార్టనర్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు తెలుస్తుంది. ఈ ట్రోల్స్ చూసి ఏడ్చాను. పెళ్లి కూడా కాకుండానే డైవర్స్ గురించి మాట్లాడతారు. ఎందుకు అంత నెగిటివిటీ. మా ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు. మా డబ్బులు మా ఇష్టం, మా నిశ్చితార్థం, మా లవ్ ని సెలబ్రేట్ చేసుకున్నాం మీకెందుకు. మా ఫ్యామిలీస్ కూడా బాధపడ్డాయి అని తెలిపింది శుభశ్రీ. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా శుభశ్రీ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.