Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాగార్జున ఇప్పటికి కూడా ఎంతో హ్యాండ్సమ్ గా మన్మధుడిలాగే ఉంటారు. ఇక ఈయన ఏడుపదుల వయసుకు దగ్గర పడుతున్న అదే అందంతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు నాగార్జున కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగార్జునకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నాగార్జున గతంలో రామ్ చరణ్ నిశ్చితార్థానికి వెళ్లడానికి చాలా భయపడినట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్ నిశ్చితార్థానికి వెళ్లడానికి నాగార్జున భయపడటానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… నాగార్జున గ్రీకు వీరుడు సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. అయితే అంతకుముందు నాగార్జున షిరిడి సాయి సినిమాలో నటించారు ఈ సినిమా కోసం ఈయన గుబురు గడ్డం పొడుగు జుట్టుతో కనిపించారు. కానీ గ్రీకువీరుడు సినిమా కోసం ప్రత్యేకమైన లుక్ ట్రై చేసిన విషయం తెలిసిందే. వెరైటీగా గడ్డంతో పాటు స్పైక్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. అప్పట్లో ఈ లుక్ చాలా ట్రెండ్ అయింది.
ఇక ఈ గెటప్ తన ఇంట్లో వాళ్లకు బాగా నచ్చింది కానీ నాగర్జున అప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా రామ్ చరణ్ నిశ్చితార్థానికి ఆహ్వానం వచ్చింది అయితే ఈ గెటప్ లో చరణ్ నిశ్చితార్థానికి వెళ్తే అక్కడున్న వారు ఎలా రియాక్ట్ అవుతారోననే చాలా భయంతోనే వెళ్లారట కానీ ఆ లుక్ లో నాగార్జున చూసిన రామ్ చరణ్ తో పాటు అక్కడున్న వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారని తనకు ఆ లుక్ బాగా సెట్ అయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గ్రీకు వీరుడు సినిమాలో విభిన్నంగా కనిపించిన ఆ సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకు లేకపోయిందని చెప్పాలి.