‎Tollywood: త్వరలో ఒక్కటి కాబోతున్న బుల్లితెర జంట.. తొలిసారి ప్రపోజ్‌, వెంటనే నిశ్చితార్థం!

‎Tollywood: సినిమాలలో, అలాగే సీరియల్స్ లో నటించే చాలామంది నటీనటులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సీరియల్స్ లో నటించే చాలామంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో బుల్లితెర జంట ఒకటి అయ్యింది. ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్న ఈ జంట తాజాగా ఒకసారిగా ఎంగేజ్మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ జంట ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే..

‎తెలుగు సీరియల్‌ నటుడు మహేశ్‌బాబు కాళిదాస్‌, నటి సాండ్రా జైచంద్రన్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వీరు ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్లు మేము లవ్‌ లో ఉన్నాము అంటూ వెల్లడించారు. జీవితాంతం ఈ ప్రేమను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ జంట తాజాగా ఒక షోలో కుటుంబసమేతంగా స్టేజీ ఎక్కారు.



‎సాండ్రా పల్లకిలో రాగా, నాకు కాబోయే శ్రీమతిని మా ఇంటికి తీసుకొస్తున్నా అంటూ ఆనందపడిపోయాడు మహేశ్‌. స్టేజ్‌ పై రెండు కుటుంబాల సమక్షంలో ప్రియురాలు సాండ్రాకు ఉంగరం తొడిగాడు మహేశ్‌. ఒక్కసారి కూడా తనకు ప్రపోజ్‌ చేయలేదంటూ తొలిసారి ఐ లవ్యూ చెప్పి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాగా నటుడు మహేష్ తెలుగులో మనసిచ్చి చూడు, శుభస్య శీఘ్రం సీరియల్స్‌లో హీరోగా నటించాడు. సాండ్రా జైచంద్రన్‌ ముద్దమందారం, కలవారి కోడళ్ళు లాంటి సీరియల్స్ తో పాటు ఇంకా చాలా సీరియల్స్‌ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఆటో విజయశాంతి సీరియల్ లో నటిస్తోంది. శుభస్య శీఘ్రం సీరియల్‌ లో ఇద్దరూ కలిసి పనిచేసిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. అయితే సాండ్రాకు ఇదివరకే పెళ్లికూడా అయింది.