Anshula Kapoor: ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కూతురు అన్షులా కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. అలాగే బోనీకపూర్ మరో కూతురు అయిన జాన్వీ కపూర్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీలు కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో నటిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే జాన్వీ సోదరి అన్షులా కపూర్ తాజాగా అభిమానులకు ఒక గుడ్‌న్యూస్ చెప్పింది.
తనకు మనసుకు నచ్చినవాడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు రోహన్ తక్కర్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసింది. డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాము. మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో ప్రపోజ్ చేశాడు. అది కూడా అర్ధరాత్రి 1.15 గంటలకు. అప్పుడు పొద్దున ఆరింటివరకు మాట్లాడుకుంటూనే ఉన్నాము. అప్పుడు ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాలపాటు ఆగిపోయినట్లు అనిపించింది.
ఈ ప్రయాణం ఇక్కడి దాకా వస్తుందని నాకు అప్పుడే అనిపించింది. అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. అతని లవ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పాను. నా బెస్ట్‌ఫ్రెండ్ తో ఎంగేజ్‌మెంట్ జరిగింది అని అన్షులా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం అన్షులా కపూర్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సినీ అభిమానులు, నెటిజన్లు అన్షులా, రోహన్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.