Balakrishna: నాగబాబు ఎవడో నాకు తెలియదు… బాలకృష్ణ సంచలన ట్వీట్!

Balakrishna: ఏపీ రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి అయితే తాజాగా ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు మంత్రిగా అడుగు పెట్టబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. జనసేన అన్నిచోట్ల విజయం సాధించడంలో నాగబాబు కీలకపాత్ర వహించారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన అన్నయ్యకు కూడా క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నారని సమాచారం.

ముందుగా నాగబాబు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ బాధ్యతలను బీఆర్ నాయుడుకి అప్పగించారు. ఇక ఈయనని రాజ్యసభకు పంపిస్తారు అంటూ కూడా వార్తలు వినిపించగా మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉంటే ఒకటి బిజెపికి రెండు టిడిపి నేతలు కైవసం చేసుకున్నారు. ఇకపోతే జనసేనలో నాలుగు మంత్రి పదవులు ఉండగా ఇప్పుడు ముగ్గురు మాత్రమే మంత్రి పదవులు అందుకున్నారు.

ఇక మిగిలిన ఒక మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని చూస్తున్న నేపథ్యంలో నాగబాబుకు బాలకృష్ణకు గతంలో జరిగినటువంటి ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఆ ఇంటర్వ్యూలో నాగబాబును బాలయ్య బాబు గురించి చెప్పాలని కోరారు. బాలయ్య అంటే పాత యాక్టర్‌ కదా.. నేరం-శిక్ష సినిమాలో నటించిన బాలయ్య పెద్ద ఆర్టిస్టు అని నాగబాబు అన్నారు. అయితే బాలయ్యబాబు ఎవరు అంటూ మరోసారి ప్రశ్నించగా ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ నాగబాబు సమాధానం చెప్పారు.

నాగబాబుకు మంత్రివర్గంలో చోటు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వైరలవుతోంది. అయితే దీనిపై బాలకృష్ణ పేరుతో ఉన్న ట్విట్టర్‌ హ్యాండిల్‌లో అయితే ఓ లైన్‌ రాశారు. సారీ నాగబాబు అంటే ఎవడో నాకు తెలియదు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది నిజంగానే బాలకృష్ణ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిందా లేదా అనేది మాత్రం తెలియదు కానీ ఇది మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక బాలయ్య అభిమానులు మాత్రం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయినా బాలకృష్ణకు మాత్రం ఎలాంటి మంత్రి పదవి లేదు కానీ అడ్డంగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.