క్రిస్టోఫ‌ర్ నోలాన్‌లా ప్ర‌తి సినిమాకి ప్ర‌యోగం చేయ‌గ‌లిగే ఏకైక టాలీవుడ్ డైరెక్ట‌ర్?

tollywood

ఏ దర్శకుడూ ఒకే త‌ర‌హా కాన్సెప్టులు లేదా జానర్‌కు ఎక్కువ కాలం అంకిత‌మైపోకూడదు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ .. క్రిస్టోఫర్ నోలాన్ కూడా వారి సృజనాత్మకతను ఏ ఒక్క జోన‌ర్ కో పరిమితం చేయలేదు. ఎంచుకునే క‌థ‌లు మేకింగ్ విధానంలో కొత్త శైలిని నిరంతరం అన్వేషించారు. కానీ చాలా కొద్ది మంది టాలీవుడ్ దర్శకులు మాత్ర‌మే వారి ప్రతి చిత్రానికి వైవిధ్యం ప్ర‌ద‌ర్శించగ‌లుగుతున్నారు. సింగీతం త‌ర్వాత క్రిష్ మాత్రమే అలాంటి ప్ర‌యత్నం చేస్తూ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. సుకుమార్ కి ఇలాంటి వైవిధ్యం సాధ్య‌మేన‌ని ప్రూవ్ చేస్తున్నాడు.

tollywood director krish
tollywood director krish

స‌క్సెస్ లో ఉన్న‌ తెలుగు దర్శకులు చాలా మంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి భయపడుతున్న సంగ‌తి ప్ర‌త్య‌క్షంగానే క‌నిపిస్తుంటుంది. రాజమౌళి గతంలో క‌మ‌ర్షియ‌ల్ మాస్ ఎంటర్ టైనర్లను ఒకదాని తరువాత ఒకటిగా తెర‌కెక్కించినా ఇటీవ‌ల జానర్ మారారు. ఇప్పుడు పాన్ ఇండియా ప్ర‌య‌త్నంలోనూ ఎప్ప‌టిక‌ప్పుడు ఆ త‌ర‌హాలోనే ప్ర‌య‌త్నిస్తున్నారు.

మరోవైపు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తనను తాను ఫ్యామిలీ ఎంటర్ టైనర్లకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. కొరటాల శివ మెసేజ్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామాలను తన బలంగా చేసుకున్నాడు. బోయపాటి శ్రీను ప‌క్కా మాస్ మసాలా ఎంట‌ర్ టైన‌ర్ల‌కు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. సుకుమార్ వేర్వేరు జాన‌ర్ సినిమాలతో వస్తున్నప్పటికీ, అతని కథలు చాలావరకు పగ ప్ర‌తీకారం అనే ఇతివృత్తంలో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది.

ఇత‌ర టాలీవుడ్ దర్శకులలో ఆల్ రౌండ‌ర్ ఎవ‌రు? అన్న‌ది వెతికితే క్రిష్ పేరు వెంట‌నే అందరి మనసుల్లోకి వస్తుంది. క్రిష్ ఒక దశాబ్దం క్రితం గ‌మ్యం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసినప్పటి నుండి తాను చేసిన ప్రతి చిత్రంలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టారిక‌ల్ డ్రామా నేప‌థ్యంలోని సినిమా. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలు రాజ‌కీయ నేప‌థ్యం కాగా.. పవన్ కళ్యాణ్ నటిస్తు‌న్న చిత్రం జానపద కథల ఆధారంగా రూపొందిస్తున్న డ్రామా జోన‌ర్‌. ఇటీవలే, ది జంగిల్ బుక్ మాదిరిగానే రకుల్ ప్రీత్ – వైష్ణవ్ తేజ్ లతో కలిసి కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. వైవిధ్యం కోసం క్రిష్ త‌పించే తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్ర‌తిసారీ వైవిధ్యం చూపాల‌న్న అత‌డి త‌ప‌న‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం.

Krish Director