ఆ వీడియో ఏమైంది తమ్మారెడ్డీ.?

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారనీ, అదే నేనైతే ఆ బడ్జెట్‌తో 10 సినిమాలు తీసి మొఖాన కొడతానంటూ ఇండస్ర్టీ పెద్దాయనగా చెప్పుకునే తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కోణంలోనే ఇంతా ఖర్చుపెట్టిన ఆర్ఆర్ఆర్‌కి ఆస్కార్ రాకపోతే.. అన్న కోణంలో ముందుగానే ఓ వీడియో చేసి పక్కన పెట్టుకున్నాడట. 80 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే.. అనే కోణంలో ఆ వీడియో వుండనుందనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్.

అయితే, ఆ వీడియోని ఇప్పుడు ట్రాష్‌లో పడేశాడనీ తెలుస్తోంది. ఎందుకంటే, ఆయన అంచనాలను తలక్రిందులు చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ గెలుచుకుని అంతర్జాతీయంగా కీర్తి పతాకం ఎగురవేసింది. దాంతో, మన పెద్దాయన అంచనాలూ, సంచలన వ్యాఖ్యలు చెల్లాచెదురయ్యాయ్. ఆ వీడియోని పక్కన పడేసి, మనసులో ఏమున్నా ముఖంపై లేని చిరునవ్వు పులుముకుని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందిస్తూ మరో కొత్త వీడియో రిలీజ్ చేశాడు.

‘నాటు నాటు’కు ఆస్కార్‌ రావడంపై.. తమ్మారెడ్డి రియాక్షన్‌