ముహూర్తం కుదిరింది.. కత్రినా -విక్కీ కౌశల్ పెళ్లి ఎప్పుడంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమపక్షులుగా ఉన్నటువంటి కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారని డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోని వీరి పెళ్లికి రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తుంది.

ఈ క్రమంలోనే వీరి పెళ్లి జరుగుతుంది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికే పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. మీరు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ అతి కొద్ది మంది సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు కత్రినా కైఫ్ వివాహం ఎంతో ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 7, 8 తేదీల్లో వరుసగా సంగీత్, మెహందీ వేడుకలు ప్రారంభం కాగా డిసెంబర్ 9 న పెళ్లి వేడుక జరగనుంది. ఈమె వివాహానికి కేవలం సన్నిహితులు మాత్రమే హాజరు అవుతున్నారు. పెళ్లికి దగ్గరపడుతుండడంతో ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేశారని తెలుస్తోంది. కత్రినాకైఫ్ మెహందీ ఫంక్షన్ లో భాగంగా ఈమె ప్రత్యేకంగా మెహందీ కోసం సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా వీరు పెళ్లి గురించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles