“సలార్” కి శంకర్ రోబో కి లింకేంటి?

991953-director-shankar

ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ మోస్ట్ యాన్సిపెంటెడ్  చిత్రం ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సినిమా “సలార్” కాగా ఈ సినిమా ఇపుడు దాదాపు వాయిదా పడిపోయినట్టే అని రూమర్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

కాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇంకా మౌనంగానే ఉండడంతో అందరిలో సస్పెన్స్ మరింత స్థాయిలో అయితే పెరిగిపోతుంది. దీనితో ఈ భారీ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారగా అసలు ఎందుకు వాయిదా పడింది అనే దానికి ఉన్న చాలా కారణాల్లో సినిమా గ్రాఫిక్స్ పనులు కూడా అని టాక్ వచ్చింది.

అయితే ఏఈ గ్రాఫిక్స్ పరంగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన మాసివ్ విజువల్ వండర్ రోబో 2.0 సినిమాకి లింక్ ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 2.0 సినిమాకి శంకర్ ఓ ప్రముఖ వి ఎఫ్ ఎక్స్ టీం కి భాద్యతలు అప్పగించగా వారు ఎలాంటి అవుట్ పుట్ ఇచ్చారో చూసాం.

కాగా ఇపుడు సలార్ చిత్ర యూనిట్ కూడా అదే టీం కి పనులు అప్పగిస్తే ఇప్పుడు మళ్ళీ వారు అప్పుడు 2.0 కి చేసిన పనే చేశారు అట. అదే నాసిరకం విజువల్స్ ని ఇస్తే అది చిత్ర యూనిట్ కి నచ్చలేదు అని దీనితో ఆ పనులు మళ్ళీ చేయిస్తున్నారు అని అందుకే సినిమా ఆలస్యం అయ్యేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి ఇలా శంకర్ కి అప్పుడు దెబ్బేసి మళ్ళీ ఇప్పుడు వారు సలార్ కి కూడా దెబ్బేసారని చెప్పాలి.