గంగవ్వ.. టోటల్ బిగ్ బాస్ అన్ని సీజన్ల కంటెస్టెంట్లలో స్పెషల్ కంటెస్టెంట్. ఎందుకంటే.. ఆమెకు ఇచ్చినన్ని ప్రత్యేక సౌకర్యాలు ఏ సీజన్ లో ఏ హౌస్ మెట్ కు దక్కలేదు. అందుకే ఆమె స్పెషల్ కంటెస్టెంట్. ఆ విషయాన్ని బిగ్ బాసే చెప్పారు. అయితే.. అనుకోని పరిస్థితుల వల్ల ఇంకా ఇంట్లో ఉండాలని ఉన్నా.. గంగవ్వను శనివారం ఎలిమినేట్ చేశారు. ఇంటి నుంచి బయటికి పంపించారు. నిజానికి తన ఆరోగ్యం బాగా లేదు. కానీ.. తన ఆరోగ్యం బాగా లేని మూలాన గంగవ్వను బిగ్ బాస్ యాజమాన్యం ఇంటి నుంచి బయటికి పంపించలేదు. దానికి వేరే కారణం ఉంది. గంగవ్వ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి అది పెద్ద కారణమే ఉంది. అది తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు.
మొదటి నుంచి హౌస్ లో గంగవ్వ పేరు చెప్పుకొని.. గంగవ్వకు సేవలు చేస్తున్నామని.. గంగవ్వను బాగా చూసుకుంటున్నామని.. సేఫ్ గేమ్ ఆడటం మొదలు పెట్టారు కొందరు కంటెస్టెంట్లు. ముఖ్యంగా ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. సేఫ్ గేమ్ ఆడాల్సిన సందర్భం వచ్చినప్పుడు అందరి చూపు గంగవ్వ మీదే పడుతోంది. అంతెందుకు.. ఈ హౌస్ లో హీరో ఎవరు? అని అడిగితే.. అందరూ టక్కున గంగవ్వ పేరే చెబుతారు. ఒకవేళ.. గంగవ్వను కాకుండా వేరే వ్యక్తిని హీరో అంటే.. మిగితా కంటెస్టెంట్లు ఎక్కడ తమకు వ్యతిరేకం అవుతారో అని.. కంటెస్టెంట్లు చాలా తెలివిని ప్రదర్శించి.. గంగవ్వను ఉపయోగించుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
ఇటీవల చందనా బ్రదర్స్ టాస్క్ లోనూ గంగవ్వనే గెలిపించారు. ఎందుకు గొడవ అనుకుంటున్నారా? లేక సేఫ్ గేమ్ ఆడాలంటే గంగవ్వనే ప్రతి దాంట్లో వాడుకోవాలనుకుంటున్నారా? అనేది ప్రేక్షకులకు అర్థం కాలేదు. అంతెందుకు.. హౌస్ లో ఏ కంటెస్టెంట్ గురించి నిర్ణయం తీసుకోవాలన్నా.. గంగవ్వ నువ్వు చెప్పు.. ఎవరనుకుంటున్నావు.. అంటారు. తను ఎవరి పేరు చెబితే వాళ్లకు జై కొడుతున్నారు మిగితా కంటెస్టెంట్లు.
ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం చాలా నిశితంగా పరిశీలిస్తోంది. అంతే కాదు.. గంగవ్వను ఎవ్వరూ నామినేట్ కూడా చేయడం లేదు. భవిష్యత్తులోనూ ఎవ్వరూ నామినేట్ చేయరు కూడా. ఎక్కువ కంటెస్టెంట్లు గంగవ్వను చూసి జాలి పడుతున్నారు కానీ.. తను కూడా తోటి కంటెస్టెంటే అని ఎవ్వరూ ఆలోచించలేదు. ఒక్క సొహైల్ తప్ప.
అందుకే.. ఓసారి బెస్ట్ పర్ ఫార్మర్ విషయంలో కుమార్ సాయి.. గంగవ్వను తన ఒపినియన్ అడగబోతుంటే సొహైల్ అడ్డుపడ్డాడు. గంగవ్వ అన్ని చూడలేదు.. చూడదు కూడా. తన ఒపినియన్ తీసుకొని అన్ని విషయాల్లో ఆమె నిర్ణయాన్నే ఫైనల్ చేయడం కరెక్ట్ కాదు.. అని కరెక్ట్ పాయింట్ లేవనెత్తాడు సొహైల్. కానీ.. మిగితా కంటెస్టెంట్లు కూడా సొహైల్ లా ఆలోచించకపోవడం వల్లనే నేడు గంగవ్వ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది.
ఈ విషయాలన్నీ తెలుసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం.. కంటెస్టెంట్లు సేఫ్ గేమ్ ఆడటానికి గంగవ్వను ఒక పావులా వాడుకుంటున్నారని అర్థం చేసుకున్నారు. అందుకే.. ఆరోగ్యం పేరుతో గంగవ్వను బయటికి పంపించేశారు. ఎందుకంటే.. గంగవ్వకు వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం బాగా లేదు. రెండో వారంలోనూ తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు. అప్పుడు ఓ వారం రోజులు తను అనారోగ్యంతో బాధపడింది. అప్పుడు ఎందుకు గంగవ్వను బయటికి పంపించలేదు. తను బిగ్ బాస్ ను అప్పుడు కూడా రిక్వెస్ట్ చేసింది. కానీ.. అప్పుడు పంపించకుండా.. ఇప్పుడు పంపించడానికి అసలు కారణం.. తన అనారోగ్యం కాదు.. ఇదే అసలు కారణం అని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఏది ఏమైనా ఇప్పుడు గంగవ్వ ఇంట్లో లేదు. ఇక.. ఇంటి సభ్యులు ఎలాంటి సేఫ్ గేమ్ ఆడే చాన్స్ ఉండదు. చూద్దాం.. ఇప్పటికైనా తమ కళ్లకు ఉన్న గంతలు తీసి కింద పెట్టి తమ ఆటను ఆడుతారో? లేక ఇంకా అదే ముసుగులో ఉంటారో?