నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు, కృష్ణ అభిమానులు ,తెలుగు ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయి కృష్ణ గారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ ఎనలేని సేవ చేశారని ఇండస్ట్రీ అభివృద్ధిలో తన వంతుగా అందించిన సేవలు పది కాలాలపాటు గుర్తుండిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపు 350 సినిమాలకు పైగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ ప్రతి ఒక్కరి ని ఆప్యాయంగా పలకరించేవారు.
సూపర్ స్టార్ కృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప గొప్ప విజయాలను సాధించి తెలుగు ఇండస్ట్రీ స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి ,గల్లా జయదేవ్ వీరి వివాహ వేడుకలు చెన్నైలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఆ వివాహ వేడుకలకు అప్పటి ముఖ్యమంత్రి జయలలితను కృష్ణగారే స్వయంగా వెళ్లి తన పెద్ద కూతురు వివాహానికి ఆహ్వానించారు. కృష్ణ గారి మీద అభిమానంతో ముఖ్యమంత్రి హోదాలో జయలలిత వివాహ వేడుకలకు తప్పకుండా వస్తానని చెప్పింది.
అయితే వివాహ వేడుకలకు మూడు రోజుల ముందే జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్లు కృష్ణ గారి దగ్గరికి వెళ్లి జయలలిత సెక్యూరిటీ దృష్ట్యా వివాహ వేదిక ముందు మూడు వరసలు జయలలిత గారికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కొద్దిసేపు ఆలోచించిన కృష్ణ గారు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు చాలామంది వస్తారు కేటాయించడం సాధ్యపడదని సెక్యూరిటీ ఆఫీసర్లకు మనవి చేసుకోవడంతో పాటు స్వయంగా జయలలిత గారికి ఫోన్ చేసి తన కుమార్తె పెళ్లి వేడుకలకు తమరు రా వద్దని పరిస్థితిని అర్థం చేసుకోవాలని విన్నవించుకోవడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న జయలలిత వివాహ వేడుకలకు రాకుండా గిఫ్టును ఇచ్చి పంపిందని అలనాటి సినీ ప్రముఖులు కొందరు చెబుతుంటారు.