ఏంటీ…బాహుబలి సినిమా ఆపేద్దామని రాజమౌళి చెప్పారా.. అసలు కారణం ఏంటంటే?

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ గా తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టించడమే కాకుండా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. బాహుబలి సినిమా అనంతరం ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఇకపోతే బాహుబలి చిత్రాన్ని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన బాహుబలి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.మర్యాద రామన్న సినిమాతో సక్సెస్ అందుకున్న తాము తిరిగి బాహుబలి సినిమా చేయాలని ప్లాన్ చేసాము.ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేసినప్పటికీ ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చయింది.

ఇలా ఈ సినిమా బడ్జెట్ రెండింతలు పెరగడంతో రాజమౌళి ఈ సినిమా ఆపేద్దామని చెప్పారు. ఇలా సినిమా మధ్యలో ఆపేయడానికి తాను ఒప్పుకోలేదని, చాలెంజ్ చేసి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించామంటూ ఈ సందర్భంగా శోబోయార్లగడ్డ బాహుబలి సినిమా గురించి వెల్లడించారు. ఆరోజు ఈ సినిమాకి రిస్క్ చేయడం వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అందుకుందని ఈ సందర్భంగా ఈయన బాహుబలి సినిమా గురించి వెల్లడించారు.