సూపర్ స్టార్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈయన మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కృష్ణకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తనని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈయన నేడు ఉదయం మరణించారు. ఇక కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సెలబ్రిటీలు ఆస్పత్రికి వెళ్లి కృష్ణ గారిని చివరిసారి చూశారు. ఇకపోతే కృష్ణ గారు మరణం గురించి కాంటినెంటల్ వైద్యులు స్పందించి ఆయన మరణానికి గల కారణాలను తెలియజేశారు.
ఈ క్రమంలోనే కృష్ణ గారికి వైద్యం అందించిన డాక్టర్లలో గురు ఎన్ రెడ్డి అనే డాక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణ మరణించడానికి కారణాలు తెలిపారు. కృష్ణ గారు ఆదివారం రాత్రి తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని అయితే ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే సమయానికి స్పృహలో లేరని తెలిపారు. ఈయనకు 20 నిమిషాల పాటు సిపిఆర్ నిర్వహించి స్పృహలోకి తీసుకువచ్చామని అనంతరం వెంటిలేటర్ పై తనకు చికిత్స అందించామని తెలిపారు.అయితే గడిచే ప్రతి ఒక్క నిమిషం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఈయనకు గుండెపోటు మాత్రమే కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన రెండు మూడు గంటల వ్యవధిలోనే మల్టీ ఆర్గాన్స్ డామేజ్ అయ్యాయని వైద్యుడు వెల్లడించారు.
ఇలా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ కూడా నిర్వహించామని అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు చికిత్స అందిస్తూ మరింత ఇబ్బందికరంగా మార్చడం సరి కాదని తన ఆరోగ్య పరిస్థితి గురించి తన కుటుంబ సభ్యులకు వెల్లడించామని వైద్యుడు వెల్లడించారు. ఇలా గుండెపోటు మాత్రమే కాకుండా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం, వీరికి తోడు బ్రెయిన్ కూడా డామేజ్ కావడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మరణించారని డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.