కృష్ణ మృతిపై ఎమోషనల్ ట్వీట్ చేసిన మెగాస్టార్.. మాటలకందని విషాదం అంటూ పోస్ట్?

సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఎంతోమంది సినీ ప్రముఖులు కృష్ణ మరణం పై స్పందిస్తూ ఆయనని కడసారి చూడడం కోసం పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు అదే విధంగా మరి కొంతమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కృష్ణ మృతి పట్ల స్పందిస్తూ ఆయన మృతికి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోనే కృష్ణ మరణ వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేస్తూ కృష్ణ మృతికి నివాళులు అర్పించారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కృష్ణ గారి మరణం పై మాట్లాడుతూ మాటలకందని విషాదం కృష్ణ గారి మరణం నమ్మసక్యం కావడం లేదనీ ఆయన మృతి పట్ల స్పందించారు. కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ తలెత్తుకునేలా చేసిన నటుడు ఈయన ధైర్య సాహసాలు ప్రయత్నాలకు పర్యాయపదం. మంచితనం పట్టుదల ధైర్య సాహసాల కలబోత కృష్ణ గారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు.

కృష్ణ గారు మరణించడంతో ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆయన మృతి పట్ల నివాళులు అర్పించడమే కాకుండా నా సోదరుడు మహేష్ బాబు ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంటూ ఈ సందర్భంగా చిరంజీవి కృష్ణా మరణం పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక కృష్ణ మరణ వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సైతం ఆయన మరణ వార్తపై స్పందించి ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.